ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 22వ సినిమాను ప్రముఖ దర్శకుడు అట్లీతో చేయబోతున్న సంగతి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అట్లీ 'జవాన్' తర్వాత తీస్తున్న సినిమా ఇదే కావడం, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో కలిసి పనిచేయడం.. ఈ ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమాకు ఓ స్పెషల్ హైప్‌గా నిలిపింది.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే గట్టి సన్నాహాలు సాగుతున్నాయి. దుబాయ్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరగడం, ప్రముఖ స్టూడియోల చుట్టూ దర్శకుడు అట్లీ, బన్నీ సంచరిస్తుండటంతో వారి ప్రాజెక్టు పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈసారి అట్లీ టెక్నికల్ గా ఒక మెట్టు పైకి ఎక్కేలా కథను ప్రెజెంట్ చేయనున్నారని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులకు నాలుగు నెలల సమయం కేటాయించడం, ప్రత్యేకంగా వర్క్‌షాపులు నిర్వహించాలనే ప్లాన్ – ఇవన్నీ ఈ సినిమాకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో చెప్పకనే చెప్తున్నాయి. అట్లీ ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ఇంతగా ముందస్తు పనులకు ప్రాధాన్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
ఇంకా, ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్ కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి సాధారణంగా తీయడం చాలా కష్టమైంది. అందుకే అంతర్జాతీయ స్థాయి సాంకేతిక బృందాన్ని రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ఈ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా విదేశీ స్టూడియోల సహాయంతో విఎఫ్ఎక్స్, సీజీ పనులు నిర్వహించనున్నారు.
సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సినీ వర్గాల్లో హీట్ క్రియేట్ చేస్తోంది. నవంబర్ లో చిత్ర ప్రారంభోత్సవాన్ని జరిపేందుకు ప్లాన్ జరుగుతోందని తెలుస్తోంది.
0 Comments