లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంతకీ ఎప్పుడో తెలుసా


  


చిత్ర పరిశ్రమలో హ్యూమర్‌తో కూడిన వినూత్న ప్రేమకథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విఘ్నేశ్ శివన్, తన తదుపరి చిత్రం ‘ఎలకే’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్‌గా కృతిశెట్టి జంటగా నటిస్తున్నారు.

7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌ పై లలిత్ కుమార్, నయనతార-విఘ్నేశ్ శివన్ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ తో కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నటులు ఎస్ఓ సూర్య, సీమాన్, మిస్కిన్, యోగిబాబు, గౌరీ, ఆనంద్ రాజ్, మాళవిక, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీకి సత్యన్ సూర్యన్ పనిచేస్తుండగా, సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ సౌండ్స్ అందిస్తున్నారు.

ఇప్పటికే 2023లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశకుచేరుకుంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. నేటి యువత ప్రేమ కథల నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ చిత్రం టైమ్ ట్రావెల్ అంశాన్ని సమ్మిళితం చేసుకొని వినోదాత్మకంగా సాగనుంది.

ఈ చిత్రానికి ముందుగా ‘ఎల్ఐసీ’ అనే పేరు ఖరారు చేయగా, అదే పేరుతో ఉన్న జీవిత బీమా సంస్థ అభ్యంతరం తెలిపిందట. దీంతో ఆ చిత్ర బృందం దాన్ని ‘ఎలకే’ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ గా మార్చింది.  

Post a Comment

0 Comments