జాన్వీ కపూర్ తో రామ్ చరణ్‌ జోడీ.. ట్రెండింగ్ లో కొత్త ప్రేమ కథ !

   


మెగా హీరో రామ్ చరణ్ కొత్త చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.  ఇప్పటి వరకు దాదాపు 30 శాతం ఫిల్మింగ్ పూర్తయినట్లు సమాచారం. మే నెలాఖరులో మిగిలిన భాగాలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ చిత్రం ఓ గ్రామీణ నేపథ్యంలో నడిచే క్రీడా కథాంశంతో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ ఓ పట్టుదల గల యువకుడిగా, రఫ్ అండ్ రగ్డ్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ పాత్ర చరణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవనుందని చిత్రబృందం ఆశిస్తోంది.

ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపికవ్వగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27ను రోజున విడుదల చేసేందుకు లక్ష్యంగా పెట్టుకొని చిత్ర బృందం పని చేస్తోంది. 

ఇక ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఓ మాస్ నంబర్‌ను ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాట కోసం పాపులర్ నటి శ్రీలీలను సంప్రదించినట్టు సమాచారం. దీని పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘పెద్ది’ చిత్రం చరణ్ ఫ్యాన్స్‌కి ఒక వినూత్న అనుభూతిని అందించనుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

Post a Comment

0 Comments