తమిళ మాస్ హీరోలలో విశాల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. యాక్షన్, మాస్ ఇమేజ్‌కి పెట్టింది పేరు. రెండున్నర దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆయన, తమిళంతో పాటు తెలుగులోనూ తన సినిమాలు రిలీజ్ చేస్తూ రెండు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నారు.
అయితే ఇటీవల విశాల్ ఆరోగ్య పరిస్థితి అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ఓ కార్యక్రమంలో వేదికపై చేతులు వణికిస్తూ, తల పైకి ఎత్తలేని స్థితిలో కనిపించడంతో అనేక వదంతులు వెలువడ్డాయి. కొద్దిరోజులకు మళ్లీ యాక్టివ్‌గా కనిపించడంతో, ఆ సంఘటనపై నాటకీయ వ్యాఖ్యలూ వినిపించాయి. అయినా ఇటీవల మరోసారి కుప్పకూలిన ఘటన వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలీ ఆరోగ్య చర్చల నడుమ, విశాల్ అకస్మాత్తుగా తన ప్రేమను ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. నటుడు సాయిధన్సికతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి, ఈ ఆగస్టులో వివాహం జరగనుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా మేనేజ్ చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
విజయాల పరంగా కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో విశాల్ కొత్త దశలోకి అడుగుపెడుతున్నాడు. reel లైఫ్ కాదు, real లైఫ్‌లో కూడా ఆయన ఇచ్చే ట్విస్టులు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

0 Comments