పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో భద్రతా పరంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా పలు రంగాల పై ప్రభావం చూపింది. అందులో సినీ రంగం కూడా ఒకటి. భారతీయ సినిమా పరిశ్రమ అంతర్జాతీయ ప్రతిభకు ఎప్పుడూ తెరపైకి తీసుకువస్తూనే ఉంటుంది. ఈ విధంగానే పాకిస్తాన్ నటీనటులకు కూడా అవకాశాలు లభించాయి. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో కొన్ని మార్పులు సంభవించాయి.
ఇటీవల బాలీవుడ్ చిత్రం సనం తేరీ కసమ్ 2 నుండి పాక్ నటి మావ్రా హోకెన్‌ను తప్పిస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దేశ భద్రత ముఖ్యమనే అభిప్రాయంతో, ఉగ్రవాదాన్ని ఎలాంటి రూపంలోనైనా ఖండిస్తాం అంటూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయం పై హీరో హర్షవర్ధన్ రాణే తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. “దేశాన్ని కించపరచే వ్యాఖ్యలు చేసిన వారితో తాను కలిసి పని చేయలేను” అంటూ గతంలో ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయన గతంలోనే మావ్రా ఉంటే తాను నటించేది లేదని పేర్కొనడం గమనార్హం.
ఈ పరిణామాలు, సినిమా రంగంలో దేశభక్తి ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. దేశ ప్రయోజనాలే ప్రధానం అనే ధోరణితో సినిమాల్లో విదేశీ నటుల ఎంపిక పై మరింత శ్రద్ధ చూపిస్తోందని స్పష్టమవుతోంది.
0 Comments